'మీసాల పిల్ల' పాట వచ్చేసింది... ఎంజాయ్ చేయండి: చిరంజీవి

Chiranjeevis Meesala Pilla Song Released From New Movie
  • చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రం
  • 'మీసాల పిల్ల' పాట లిరికల్ వీడియో విడుదల
  • సోషల్ మీడియాలో పంచుకున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన కొత్త చిత్రం నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలోని 'మీసాల పిల్ల' అనే పాట లిరికల్ వీడియోను పంచుకున్నారు. ఆ పాట వివరాలను స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాఉ. ఈ పాటను దిగ్గజ గాయకుడు ఉదిత్ నారాయణ్ ఆలపించడం విశేషం. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ మెలోడీకి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ఉదిత్ నారాయణ్‌తో పాటు శ్వేతా మోహన్ కూడా ఈ గీతాన్ని ఆలపించారు. గతంలో చిరంజీవి చిత్రాలలోని ఎన్నో సూపర్ హిట్ గీతాలకు ఉదిత్ నారాయణ్ తన గాత్రాన్ని అందించారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌లో పాట రానుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. 

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార, కేథరిన్ ట్రెసా కథానాయికలుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అప్‌డేట్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
Go Back to Shorts
Chiranjeevi
Manashankara Varaprasad Garu
Meesala Pilla Song
Anil Ravipudi
Udith Narayan
Nayanthara
Catherine Tresa
Telugu Movie Song
Bhaskarabatla
Bheems Ceciroleo

More Telugu News