సల్మాన్ ఖాన్ తో దిల్ రాజు భారీ సినిమా... డైరెక్టర్ ఎవరంటే..!
- దర్శకత్వం వహించనున్న టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి
- ఇప్పటికే కథకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్న బాలీవుడ్ వర్గాలు
- గేమ్ ఛేంజర్, తమ్ముడు సినిమాలతో దిల్ రాజుకు భారీ నష్టాలు
వివరాల్లోకి వెళితే, వంశీ పైడిపల్లి చెప్పిన ఓ కథకు సల్మాన్ ఖాన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆయన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఇతర ఒప్పందాలు, మిగిలిన విషయాలపై దిల్ రాజు బృందంతో సల్మాన్ చర్చలు జరుపుతున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చర్చలు సఫలమైతే, త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టు అధికారికంగా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో తమిళ స్టార్ విజయ్ తో ‘వారిసు’ (తెలుగులో వారసుడు) వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన వంశీ పైడిపల్లి, ఇప్పుడు సల్మాన్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశారనేది ఆసక్తికరంగా మారింది.