సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన నారా భువనేశ్వరి
- నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ అవార్డు
- మై డియర్ భు అంటూ చంద్రబాబు ప్రేమపూర్వక అభినందనలు
- మీరే నాకు దారి చూపే వెలుగు అంటూ నారా భువనేశ్వరి వినమ్ర స్పందన
తన జీవితంలో చంద్రబాబు పాత్రను వివరిస్తూ భువనేశ్వరి హృద్యమైన మాటలను పంచుకున్నారు. "మీరే నాకు ఎల్లప్పుడూ బలమైన మద్దతుదారు, నన్ను ప్రోత్సహించే శక్తి, దారి చూపే వెలుగు" అని ఆమె పేర్కొన్నారు. తాను వేసే ప్రతి అడుగులోనూ తన భర్త చూపించే నమ్మకం, ప్రేమలోని ఆప్యాయత ఎంతో బలాన్ని ఇస్తాయని ఆమె తెలిపారు.
"ఈ జీవిత ప్రయాణాన్ని మీతో కలిసి పంచుకోవడం నా అదృష్టం" అంటూ భువనేశ్వరి తన మనసులోని మాటను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.