కాంగ్రెస్‌కు షాక్.. తిరిగి బీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్, హరీశ్ రావు
- 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుండి పోటీ చేసి ఓడిపోయిన కోనేరు కోనప్ప
- ఆ తర్వాత బీఆర్ఎస్‌కు దూరం జరిగి కాంగ్రెస్‌లో చేరిన కోనప్ప
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. గత కొంతకాలంగా ఆయన కేసీఆర్ నాయకత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేస్తుండటంతో తిరిగి పార్టీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. ఈరోజు ఎర్రవెల్లిలో కేటీఆర్, హరీశ్ రావుల సమక్షంలో ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.