ధోనీ క్రేజ్ మామూలుగా లేదుగా.. రోల్స్ రాయిస్ కారు వీడియో వైరల్
- రాంచీలోని ఇంటి నుంచి రోల్స్ రాయిస్ కారులో బయటకు వచ్చిన మహీ
- ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించి నెట్టింట పోస్ట్ చేసిన అభిమానులు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ధోనీ వీడియో
రాంచీలోని సిమ్లియాలో ఉన్న ధోనీ ఇంటి గేటు తెరుచుకోగానే, లోపలి నుంచి మెరిసిపోతున్న రోల్స్ రాయిస్ కారు నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న అభిమానులు ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.
కాగా, ఈ వీడియో మూడు రోజుల క్రితం నాటిదని తెలుస్తోంది. అయితే, తాజాగా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవ్వడంతో ధోనీ అభిమానులు దీన్ని తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.
ధోనీకి కార్లు, బైక్‌లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గ్యారేజీలో అనేక రకాల సూపర్ బైక్‌లు, విలాసవంతమైన కార్లు ఉన్నాయి. తాజాగా బయటకొచ్చిన ఈ రోల్స్ రాయిస్ కారు వీడియో, ఆయన వాహనాలపై ఉన్న మక్కువను మరోసారి చాటి చెబుతోంది.