Anushka Shetty: 'ఘాటి' ఘాటు .. అనుష్క ఫ్యాన్స్ వెయిటింగ్!
- అనుష్క ప్రధాన పాత్రధారిగా 'ఘాటి'
- హైలైట్ గా నిలవనున్న ఆమె యాక్షన్ సీన్స్
- ఆమె కెరియర్ లో నిలిచిపోయే సినిమా అంటున్న క్రిష్
- ప్రధానమైన పాత్రల్లో బలమైన తారాగణం
- సెప్టెంబర్ 5వ తేదీన ఐదు భాషల్లో విడుదల
తెలుగు .. తమిళ భాషల్లో అనుష్కకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అందానికి అసలైన కొలమానం అనుష్క అని ఆమె ఫ్యాన్స్ అంటారు. ఆకర్షణకి నిజమైన నిదర్శనం కూడా ఆమెనే అని బలంగా చెబుతారు. అయితే అనుష్క అభిమానులలో సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇతర భాషలకు చెందిన హీరోలు .. హీరోయిన్స్ కూడా ఉండటం విశేషం. నిజంగానే జానపద .. పౌరాణికాలకు సైతం సరిగ్గా సరిపోయే చక్కని కనుముక్కు తీరు అనుష్క సొంతం అనేది ఎవరూ కాదనలేని మాట.
అనుష్క సినిమాల సంఖ్య తగ్గించి చాలా కాలమైంది. నాయిక ప్రధానమైన కథల వైపే ఆమె ఎక్కువగా మొగ్గు చూపుతోంది. అలా ఆమె అంగీకరించిన సినిమానే 'ఘాటి'. యూవీ - ఫస్టు ఫ్రేమ్ బ్యానర్లు కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాకి క్రిష్ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్, ఒక్కసారిగా అంచనాలు పెరిగేలా చేసింది. గంజాయి మోసే కూలీగా ఈ సినిమాలో అనుష్క కనిపించనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో జగపతిబాబు .. విక్రమ్ ప్రభు .. రమ్యకృష్ణ .. జిషు సేన్ గుప్తా కనిపించనున్నారు.
ఈ సినిమాలో అనుష్క భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నట్టుగా ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. ఆమెకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెబుతున్నారు. తమకి ఆధారమైన కొండ ప్రాంతంపై కొన్ని స్వార్థ శక్తులు పట్టు బిగించడానికి ప్రయత్నిస్తే, వాళ్లతో పోరాటానికి దిగే పాత్రలో అనుష్క కనిపించనుంది. రెండేళ్ల తరువాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో, అభిమానులు ఈ సినిమా పట్ల ఆసక్తితో ఉన్నారు. 5 భాషల్లో సెప్టెంబర్ 5న విడుదలవుతున్న ఈ సినిమా, ఏ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనేది చూడాలి.