వెంకీ, త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం
- 'ఎక్స్' వేదికగా తన కొత్త సినిమాను ప్రకటించిన వెంకటేశ్
- నేడు పూజా కార్యక్రామాలు జరుపుకున్న కొత్త ప్రాజెక్ట్
- వెంకీ నటించిన మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు
- ఇప్పుడు హిట్ కాంబోలో మూవీ సెట్ కావడంతో అభిమానుల హర్షం
కాగా, వెంకీ నటించిన 'మల్లీశ్వరి', 'నువ్వు నాకు నచ్చావ్' వంటి సూపర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేశారు. ఇప్పుడు ఈ కాంబోలో మూవీ ఖాయం కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో వెంకటేశ్ భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో వెంకీ మామ తదుపరి సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూశారు. ఇప్పుడు త్రివిక్రమ్‌తో మూవీ చేస్తుండడంతో వారి ఆనందానికి అవధుల్లేవ్. ఈ కాంబో తప్పనిసరిగా సూపర్ హిట్ కొడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.