Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడం సేల్.. ఈ ఏడాదిలోనే అత్యంత చవకగా ట్యాబ్‌ ధరలు!

Flipkart Freedom Sale Offers Lowest Tablet Prices This Year
  • అందుబాటులో పలు బ్రాండ్ల ట్యాబ్లెట్లు
  • సగానికి సగం తగ్గిన ధరలు
  • ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనున్న సేల్
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా వివిధ బ్రాండ్ల టాబ్లెట్‌లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. నిన్న ప్రారంభమైన ఈ సేల్ ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో వినోదం, విద్య, ప్రొఫెషనల్ అవసరాలకు అనుగుణంగా టాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి.  

షియోమి ప్యాడ్ 7: దీని  అసలు ధర రూ. 34,999. ప్రస్తుతం ఇది రూ. 21,999కే లభిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్‌సెట్, 11.2 అంగుళాల డిస్‌ప్లే, 256 GB స్టోరేజ్‌తో వస్తోంది. 

రియల్‌మీ ప్యాడ్ 2: ఈ టాబ్లెట్ ఈ సంవత్సరంలో అతి తక్కువ ధరకు అంటే కేవలం రూ. 10,749కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర ₹28,999. హీలియో జీ99 చిప్‌సెట్, 120హెచ్‌జడ్ 11-అంగుళాల డిస్‌ప్లే దీని ప్రత్యేకతలు.

 లెనోవో ట్యాబ్ ప్లస్: రూ. 32,000 విలువైన ఈ టాబ్లెట్ 50 శాతం కంటే ఎక్కువ తగ్గింపుతో రూ.14,499కే లభిస్తోంది. 11.5 అంగుళాల స్క్రీన్, 8600 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 

రెడ్‌మీ ప్యాడ్ ఎస్ఈ: అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ బడ్జెట్ టాబ్లెట్ ధర రూ. 19,999 నుంచి రూ. 11,399కి తగ్గింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో ఇది మంచి పనితీరును అందిస్తుంది.

ఇతర ఆకర్షణీయమైన డీల్స్
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్: రూ.19,999 ఎమ్మార్పీ ఉన్న ఈ టాబ్లెట్ ఇప్పుడు రూ. 12,999 నుంచి ప్రారంభమవుతుంది. వై-ఫై మరియు 4జీ సపోర్ట్‌తో వస్తున్న ఈ ట్యాబ్ కొత్తగా కొనేవారికి మంచి ఎంపిక.

ఆపిల్ ఐప్యాడ్ ఏ16: సాధారణంగా ఐప్యాడ్‌లపై డిస్కౌంట్లు అరుదుగా ఉంటాయి. కానీ ఈ సేల్‌లో రూ. 34,900 విలువైన ఈ ఐప్యాడ్ రూ. 31,990కే లభిస్తోంది. ఇది ప్రొఫెషనల్స్, విద్యార్థులకు ప్రీమియం ఆప్షన్.

పోకో ప్యాడ్ 5G: 5జీ కనెక్టివిటీతో కూడిన ఈ టాబ్లెట్ ధర రూ. 30,999 నుంచి ₹18,999కి తగ్గింది. హై-స్పీడ్ బ్రౌజింగ్ కోసం ఇది మంచి ఎంపిక.

ఈ సేల్‌లో అనేక బ్రాండ్ల టాబ్లెట్‌లు భారీ తగ్గింపులతో లభిస్తున్నాయి. పండుగ సీజన్ రాకముందే కొత్త టాబ్లెట్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. మరిన్ని వివరాల కోసం ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Flipkart Freedom Sale
Flipkart
tablet deals
tablet discounts
Xiaomi Pad 7
Realme Pad 2
Lenovo Tab Plus
Redmi Pad SE
Apple iPad A16
Poco Pad 5G

More Telugu News