'కన్వర్టెడ్ బీసీ' అనే పదాన్ని రేవంత్ రెడ్డి కొత్తగా తీసుకు వచ్చారు: రామచందర్ రావు
- నరేంద్ర మోదీ బీసీ కాదంటూ బీసీ సమాజాన్ని అవమానించారని విమర్శ
- రాహుల్ గాంధీ గురించి అడిగితే కాంగ్రెస్ నేతలు ఏం చెబుతారని ప్రశ్న
- ఆయనకు గోబెల్స్ బహుమతి ఇవ్వాలని చురక
రాష్ట్ర బీజేపీ కమిటీలో 20 పోస్టులు మాత్రమే ఉన్నాయని రామచందర్ రావు అన్నారు. ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఏడుగురు కార్యదర్శులు, ఒక కోశాధికారి పోస్టు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అయినందువల్లే జంబో కమిటీ ఉంటుందని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లుగా తనకు ఎలాంటి రాష్ట్ర పదవి లేదని, ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని అన్నారు.