ఏఐని ఓడించిన ప్రోగ్రామర్... అభినందించిన ఓపెన్ఏఐ సీఈవో శ్యామ్ ఆల్ట్‌మన్
- జపాన్ లో ఆట్‌కోడర్ వరల్డ్ టూర్ ఫైనల్స్
- ఒపెన్ఏఐ కోడింగ్ టూల్ ను ఓడించిన పోలెండ్ ప్రోగ్రామర్
- గుడ్ జాబ్ సైహో అంటూ అభినందించిన శ్యామ్ ఆల్ట్‌మన్
ఈ పోటీలో ఓపెన్‌ఏఐ టూల్ రెండవ స్థానంలో నిలిచిందని కంపెనీ కూడా ఎక్స్‌లో ప్రకటించింది. జపాన్‌కు చెందిన ఆట్‌కోడర్ అనే కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్ సైట్ ఈ వార్షిక పోటీని నిర్వహించింది, దీనికి ఓపెన్‌ఏఐ కూడా స్పాన్సర్‌గా వ్యవహరించింది.
విజయం సాధించిన డెబియాక్ తన ఆనందాన్ని ఎక్స్‌లో పంచుకుంటూ, "మానవ మేధ ఇప్పటికి నెగ్గింది! నేను పూర్తిగా అలసిపోయాను. గత మూడు రోజుల్లో కేవలం 10 గంటలు మాత్రమే నిద్రపోయాను. విశ్రాంతి తీసుకున్న తర్వాత పోటీ గురించి మరిన్ని వివరాలు పంచుకుంటాను" అని పేర్కొన్నారు. తర్వాత, అతను మరో పోస్ట్‌లో, "ఫలితాలు ఇప్పుడు అధికారికంగా నిర్ధారణ అయ్యాయి. నా ఆధిక్యం 5.5 శాతం నుంచి 9.5 శాతానికి పెరిగింది. ప్రోగ్రామింగ్ పోటీలపై ఇంతమంది ఆసక్తి చూపడం నాకు ఆశ్చర్యంగా ఉంది" అని తెలిపారు.
ఈ విజయం మానవ సృజనాత్మకత మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన పోటీని హైలైట్ చేస్తుంది. మానవ మేధస్సు... ఏఐని అధిగమించగలదని డెబియాక్ విజయం నిరూపించింది.