రాహుల్ సిప్లిగంజ్ కు సీఎం రేవంత్ రూ. కోటి బహుమతి
--
రాహుల్ కు ప్రత్యేక అవార్డును ప్రకటించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే బోనాల పండుగ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రూ. కోటి నగదు పురస్కారం అందజేశారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్.. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పాడిన ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. మార్చి 2023 లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల వేడుకలో ఈ పాటను ప్రదర్శించారు.