ఆకాశంలో సునామీ.. పోర్చుగల్ బీచ్‌లో భయపెట్టిన వింత మేఘం.. వీడియో ఇదిగో!
- అరుదైన 'రోల్ క్లౌడ్'.. ఆకాశంలో అద్భుతం చూసి జనం ఆశ్చర్యం!
- భారీ అలల రూపంలో తీరం వైపు దూసుకొచ్చిన 'రోల్ క్లౌడ్'.. భయంతో పర్యాటకుల పరుగులు
- తీవ్రమైన వడగాల్పుల వల్లే ఈ దృగ్విషయమన్న నిపుణులు
వాతావరణ నిపుణుల ప్రకారం.. ఇది 'రోల్ క్లౌడ్' అనే చాలా అరుదైన మేఘం. వేడి, చల్లని గాలులు ఒకదానికొకటి కలిసినప్పుడు ఇలాంటివి ఏర్పడతాయి. ఇవి చూడటానికి సునామీ అలల్లా కనిపించినా, వీటికి సునామీలకు ఎలాంటి సంబంధం లేదని నిపుణులు స్పష్టం చేశారు. ఇవి భూమికి సమాంతరంగా కదులుతూ, దొర్లుతున్నట్లు కనిపిస్తాయి.
ప్రస్తుతం పోర్చుగల్ తీవ్రమైన వడగాల్పులతో అల్లాడుతోంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణంలో అస్థిరత నెలకొంది. దీని కారణంగానే సోమవారం ఇలాంటి వింత మేఘాలు ఏర్పడినట్లు 'యూరోన్యూస్' కథనం పేర్కొంది. మరోవైపు, పెరుగుతున్న ఎండల కారణంగా అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.