శుభాంశును సాగనంపి తిరిగొచ్చిన రాకెట్
- రాకెట్ నుంచి విడిపోయి ఐఎస్ఎస్ దిశగా డ్రాగన్ క్యాప్సూల్ ప్రయాణం
- 8 నిమిషాల్లోనే క్షేమంగా తిరిగి భూమిని చేరుకున్న ఫాల్కన్ 9
- ప్రపంచంలోనే తొలి ఆర్బిటల్-క్లాస్ పునర్వినియోగ రాకెట్ ‘ఫాల్కన్’
8 నిమిషాల్లోనే తిరిగి రాక..
భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 12:01 గంటలకు డ్రాగన్ క్రూ క్యాప్సూల్ తో ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి ఎగిసింది. కెన్నెడీ స్పేస్ సెంటర్ లోని 39ఏ లాంచ్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. నింగికెగిరిన ఫాల్కన్ రాకెట్ షెడ్యూల్ ప్రకారం ప్రయాణించింది. డ్రాగన్ క్యాప్సూల్ ను అంతరిక్షంలోకి వదిలి తిరిగి భూమి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ప్రయోగం ప్రారంభించిన తర్వాత 8 నిమిషాలకు రాకెట్ తిరిగి భూమిని చేరుకుంది. స్పేస్‌ఎక్స్ కంపెనీ తయారుచేసిన ఈ ఫాల్కన్ 9 రాకెట్ ప్రపంచంలోనే తొలి ఆర్బిటల్-క్లాస్ పునర్వినియోగ రాకెట్ అని శాస్త్రవేత్తలు తెలిపారు.