ఆర్చరీ క్రీడాకారులకు శాప్ ఛైర్మన్ అభినందన
- శాప్ చైర్మన్‌ను కలిసిన అర్చరీ క్రీడాకారులు గణేశ్ మణిరత్నం, షణ్ముఖి నాగసాయి
- సింగపూర్‌లో జరిగిన ఆర్చరీ ఏషియా కప్ లెగ్-2 పోటీల్లో మెడల్స్ సాధించిన టి.గణేశ్, షణ్ముఖి నాగసాయి
విజయవాడలోని శాప్ కార్యాలయంలో నిన్న చైర్మన్ రవినాయుడును వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్చరీలో వారు సాధించిన పతకాలు, విజయాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారిని శాప్ చైర్మన్ అభినందించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర, దేశ ఖ్యాతిని విస్తృతం చేయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో వోల్గా ఆర్చరీ అకాడమీ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ, ఆర్చరీ కోచ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.