హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ వేడుక వాయిదా
- పవన్ కల్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు
- ఈ నెల 8న తిరుపతిలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
- తదుపరి తేదీ ప్రకటిస్తామన్న నిర్వాహకులు
మరోవైపు సినిమా విడుదల కూడా వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, జ్యోతి కృష్ణ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కావాల్సి ఉంది.
కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొన్ని వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కానందున సినిమా విడుదల వాయిదా వేయాలని నిర్మాత నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ, సినిమా విడుదల వాయిదాపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.