పంజాబ్‌లోని బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఐదుగురి మృతి
- అర్ధరాత్రి దాటాక భారీ పేలుడు
- ఘటనా స్థలంలోనే ఐదుగురి మృత్యువాత
- ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు
క్షతగాత్రులను బఠిండాలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), ముక్త్సార్‌లోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. వాటికింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కర్మాగారం హర్యానా సరిహద్దుకు సమీపంలో ఉండటంతో అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.