ఓటీటీలోకి వచ్చిన మలయాళం హారర్ థ్రిల్లర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓటీటీలోకి వచ్చిన మలయాళం హారర్ థ్రిల్లర్!

Hunt Movie Update
  • మలయాళంలో నిర్మితమైన 'హంట్'
  • ప్రధానమైన పాత్రలో భావన 
  • ఈ నెల 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్
  • 'మనోరమ మ్యాక్స్'లో అందుబాటులో  
      
మలయాళం నుంచి హారర్ థ్రిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ తరహా సినిమాలు వచ్చాయంటే, అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అక్కడి మేకర్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మలయాళంలో రూపొందిన మరో హారర్ థ్రిల్లర్ గా 'హంట్' కనిపిస్తుంది. భావన ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను రాధాకృష్ణన్ నిర్మించగా, షాజీ కైలాస్ దర్శకత్వం వహించాడు. 

రేంజి పణిక్కర్  .. చందూనాథ్ .. అనూ మోహన్ .. అజ్మల్ అమీర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, క్రితం ఏడాది ఆగస్టు 23వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా  ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వైపు రావడానికి ఎక్కువ సమయం పట్టింది. ఈ నెల 23వ తేదీ నుంచి 'మనోరమ మ్యాక్స్' ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ లోకి వచ్చింది. 

ఈ సినిమాలో కీర్తి పాత్రలో భావన కనిపిస్తుంది. ఫోరెన్సిక్ డిపార్టుమెంటులో కీర్తి పనిచేస్తూ ఉంటుంది. ఒక హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను ఆమె పరిశీలించవలసి వస్తుంది. ఆ సమయంలో ఆమెకి కొన్ని చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అందుకు కారణం ఏమిటి? హత్యకి గురైనది ఎవరు? చేసింది ఎవరు? ఆ సంఘటనతో కీర్తికి గల సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ. 

Advertisement
Bhavana
Hunt Malayalam Movie
Malayalam Horror Thriller
Shaji Kailas
Manorama Max
Crime Thriller
Suspense Thriller
OTT Release
Malayalam Cinema

More Telugu News