Guntakal Railway Station: గుంతకల్ రైల్వే స్టేషన్ లో ప్రమాదం.. బాలుడు మృతి

Tragedy at Guntakal Railway Station Boy Dies in Accident
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్లాట్ ఫాం పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడడంతో ఓ బాలుడు చనిపోయాడు. రైల్వే స్టేషన్ లోని ఏడో నెంబర్ ఫ్లాట్ ఫాంపై ఈ ప్రమాదం జరిగింది. రామేశ్వరం వెళ్లేందుకు స్టేషన్ కు వచ్చిన ఓ కుటుంబం రైలు ఎక్కేందుకు ప్లాట్ ఫాంపై వేచి ఉంది. ఇంతలో పెచ్చులు ఊడిపడడంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించేలోపే బాలుడు కన్నుమూశాడు. కాగా, ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Guntakal Railway Station
Andhra Pradesh
Anantapur district
railway accident
child death
platform collapse
train station
Rameshwaram

More Telugu News