గవర్నర్ నివాసంలో చోరీ కలకలం.. టెక్కీ పనేనని తేల్చిన పోలీసులు
- తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ ఘటన
- సుధర్మ భవన్ నుంచి నాలుగు హార్డ్ డిస్కులు అదృశ్యం
- ఈ నెల 13న జరిగినట్టు గుర్తించిన అధికారులు
- పంజాగుట్ట పోలీసులకు రాజ్‌భవన్ సిబ్బంది ఫిర్యాదు
- కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ అరెస్ట్
ఫిర్యాదు అందుకున్న పంజాగుట్ట పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఈ చోరీకి పాల్పడింది రాజ్‌భవన్‌లోనే కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ అని పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది. అనంతరం శ్రీనివాస్‌ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ హార్డ్ డిస్కులలో ఏ విధమైన సమాచారం ఉందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. చోరీకి గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.