కంటి సమస్యతో బాధపడుతున్న పాయల్ రాజ్ పుత్!
- ఆరోగ్యం బాగాలేకపోయినా ఇచ్చిన కమిట్మెంట్ కోసం ఓపెనింగ్ ఈవెంట్స్ కోసం హాజరవుతున్నట్లు పేర్కొన్న పాయల్
- అన్ని వస్తువులూ రెండు రెండుగా కనిపిస్తున్నాయన్న పాయల్
- కంటి సమస్యను ఎలా మేనేజ్ చేయాలో తెలియక కళ్ల అద్దాలతో కవర్ చేశానన్న పాయల్
ఆర్ఎక్స్ 100 సినిమా విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు ఆ తర్వాత ఆశించిన విజయాలు దక్కలేదు. అయినప్పటికీ, హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల 'మంగళవారం' అనే సినిమాతో ఆమె మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. పాయల్ తెలుగులో మొత్తం 12 సినిమాల్లో నటించగా, వాటిలో రెండు మాత్రమే విజయం సాధించాయి. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించినా, అక్కడ ఆమెకు అంతగా కలిసి రాలేదు.