రష్యాకు వెళితే మీ ప్రాణాలకు హామీ ఇవ్వలేను.. దేశాధినేతలకు జెలెన్ స్కీ వార్నింగ్
- విక్టరీ డే వేడుకల వేళ విదేశీ అతిథులకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ హెచ్చరిక
- ఈ వేడుకల నిర్వహణ కోసం రష్యా కాల్పుల విరమణ ప్రతిపాదన
- కుదరదని తేల్చిచెప్పిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
- అదే జరిగితే మే 10న కీవ్ లో ఎవరూ మిగలరని రష్యా ఘాటు జవాబు
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య మూడేళ్లుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు దేశాల్లో నిరంతరం బాంబులు పేలుతున్నాయి. భారీ విధ్వంసం జరుగుతోంది. వైమానిక దాడులు, డ్రోన్ అటాక్ లు సాధారణంగా మారాయి. ఈ క్రమంలో విక్టరీ డే వేడుకల కోసం రష్యా కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. మూడు రోజుల పాటు కాల్పులు, బాంబు దాడులు ఆపేద్దామని ఉక్రెయిన్ కు సూచించింది. అయితే, ఈ ప్రతిపాదనను జెలెన్ స్కీ తోసిపుచ్చారు. అమెరికా చెప్పినట్లు నెల రోజుల పాటు కాల్పుల విరమణకు తాము సిద్ధమని చెప్పారు.
అంతే కానీ రెండు రోజులు, మూడు రోజులు కాల్పులు ఆపేద్దామంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తాజాగా ఈ బెదిరింపులపై రష్యా స్పదించింది. ‘కవ్వింపులు వాస్తవంలోకి మారితే.. మే 10న కీవ్‌లో ఎవరూ ఉదయాన్ని చూడలేరు’ అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.