హైదరాబాద్ బండ్లగూడ రవాణా శాఖ అధికారిణి సునీతపై సీరియస్ యాక్షన్
- ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సునీతపై ఆరోపణలు
- విచారణ జరిపి నివేదిక అందించిన అధికారులు
- క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ వేటు
ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రవర్తన బాగోలేకపోవడం, పలు ఆర్థిక అంశాలలో నేరుగా ఆమె ప్రమేయం ఉండటం గురించి ఆమెపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. తదనంతరం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెపై బదిలీ వేటు పడింది. ఈ అంశంపై బండ్లగూడ ఆర్టీవో కృష్ణయ్య మాట్లాడుతూ... ఆమె బదిలీ జరిగిందని చెప్పారు. ఆమెను ఎస్టీఏకు అటాచ్ చేశారని తెలిపారు.