సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
- నేడు సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు
- ఆయనకు సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
- ‘ఎక్స్’ వేదికగా సీబీఎన్‌కు జగన్ జన్మదిన శుభాకాంక్షలు
తాజాగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చంద్రబాబుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "హ్యాపీ బర్త్ డే నారా చంద్రబాబు నాయుడు గారూ! మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను!" అని జగన్ ట్వీట్ చేశారు.