వనస్థలిపురంలో హైడ్రా.. అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్ల కూల్చివేత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వనస్థలిపురంలో హైడ్రా.. అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్ల కూల్చివేత

HUDA Demolishes Illegal Buildings in Vanastalipuram
--
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. శనివారం ఉదయం వనస్థలిపురం చేరుకున్న హైడ్రా బుల్డోజర్లు.. ఇంజాపూర్‌లో జేసీబీల సహాయంతో అక్రమంగా నిర్మిస్తున్న ఇండ్లను అధికారులు కూల్చివేశారు. ప్రధాన రోడ్లను ఆక్రమించి ఈ కట్టడాలను నిర్మిస్తున్నట్టు గుర్తించారు. కూల్చివేతల సమయంలో అడ్డుకున్న స్థానికులకు అధికారులు నచ్చబెప్పే ప్రయత్నం చేశారు. గతంలోనూ ఇదే తరహాలో కూల్చివేతలు జరపగా.. ప్రస్తుతం హైడ్రా ఆచితూచి అడుగులు వేస్తోంది. పూర్తిగా నిర్మించిన భవనాలను కాకుండా నిర్మాణ దశలో ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేస్తోంది.
Advertisement
HUDA
Vanastalipuram
Hyderabad
Illegal Constructions
Demolition Drive
Encroachments
Building Demolition
Road Encroachment
JCBs
Urban Development

More Telugu News