TTD: టీటీడీపై అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు, అధికారుల సమీక్ష

AP Assembly Committee Reviews TTD Operations
షార్ట్స్‌లో చూడండి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యకలాపాలపై ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు, అధికారులు సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో ఈ సమీక్ష సమావేశం జరిగింది. అంచనాల కమిటీ భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవల వివరాలు తెలుసుకుంది. 

టీటీడీ అందిస్తున్న సేవలపై కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గదుల నిర్వహణపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని అంచనాల కమిటీ సభ్యులు సూచించారు. శ్రీవారి వైభవాన్ని తెలియజేసేలా డిజిటల్ మీడియాను బలోపేతం చేయాలని తెలిపారు. స్వామివారి కీర్తనలు, గోవింద నామాలు రాత్రి 10 గంటల వరకు వినిపించాలని పేర్కొన్నారు.
Go Back to Shorts
TTD
Tirumala Tirupati Devasthanams
AP Assembly Estimates Committee
Jogeswara Rao
Tirupati
Padmavathi Guest House
TTD services
Digital Media
Accommodation
Pilgrim Services

More Telugu News