బాలీవుడ్‌లోకి ధోనీ ఎంట్రీ... కరణ్ జోహార్ పోస్ట్ వైరల్!
ఇక ఈ పోస్టుకు కరణ్ ఓ వీడియోను కూడా జోడించారు. అందులో ఎంఎస్‌డీ లవ్ సింబల్ బెలూన్ పట్టుకొని కనిపించారు. దీంతో ఈ స్టార్ క్రికెటర్‌ను కరణ్ బాలీవుడ్‌లో లాంచ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌లోకి తలా ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇది ఓ యాడ్ షూటింగ్ కావొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.