మరోసారి నిలిచిపోయిన యూపీఐ సేవలు
- పనిచేయని ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లు
- యూపీఐ చెల్లింపులు జరగడం లేదంటూ యూజర్ల గగ్గోలు
- ఇటీవల యూపీఐ పేమెంట్స్ లో తరచూ ఆటంకం ఏర్పడుతున్న వైనం
ఇక ఇటీవల యూపీఐ పేమెంట్స్ లో తరచూ ఆటంకం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. గత నెల 26వ తేదీన ఇలాంటి పరిస్థితి తలెత్తగా... సాంకేతిక కారణంతో ఇలా జరిగిందని ఎన్‌పీసీఐ అప్పట్లో వివరణ ఇచ్చింది. ఆ తర్వాత ఈ నెల 2న కూడా యూపీఐ సేవలకు కొంతసేపు అంతరాయం కలిగింది. రోజుల వ్యవధిలో తాజాగా మరోసారి యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో ఆటంకం ఏర్పడింది. దీనిపై ఎన్‌పీసీఐ ఇంకా స్పందించలేదు.