న్యూడ్ కాల్స్ చేయాలంటూ గృహణికి వేధింపులు.. అనంతపురం జైలర్ వికృత చేష్టలు!

Anantapur Jailer  Accused of Harassment
  • విశాఖపట్నం మహిళకు ఫేస్‌బుక్‌లో వేధింపులు
  • 2019-21 మధ్య విశాఖపట్నంలో పనిచేసిన సుబ్బారెడ్డి 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ
  • కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో జైలర్
న్యూడ్ కాల్స్ చేయాలంటూ గృహణిని వేధించిన అనంతపురం ఓపెన్ జైలు జైలర్ సుబ్బారెడ్డిపై విశాఖ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయన పత్తా లేకుండా పోయారు. విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన ఓ గృహిణికి స్నేహం పేరుతో సుబ్బారెడ్డి ఫేస్‌బుక్‌లో రిక్వెస్టులు పెట్టాడు. విషయం తెలిసిన ఆమె భర్త సుబ్బారెడ్డిని మందలించారు. ఒకరోజు సుబ్బారెడ్డి నేరుగా ఆమెకు ఫోన్ చేసి డబ్బులు పంపిస్తానని, బ్యాంకు ఖాతా నంబరు చెప్పాలని బలవంతం చేశాడు. ఆ తర్వాత కొన్ని న్యూడ్ ఫొటోలు షేర్ చేసి, అలాంటి ఫొటోలు పంపాలని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేశారు.

సైబర్ క్రైం పోలీసుల విచారణలో వేధింపులు నిజమేనని తేలింది. దీంతో మార్చి 22న సుబ్బారెడ్డిపై కేసు నమోదైంది. 2019-21 మధ్య సుబ్బారెడ్డి విశాఖపట్నంలో పనిచేసిన సమయంలో మహిళతో ఏర్పడిన ముఖ పరిచయంతోనే ఆయనీ వేధింపులకు దిగినట్టు తెలిసింది. మరోవైపు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుబ్బారెడ్డిని విచారణకు పిలిచారు. రాకపోవడంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని అనంతపురం పంపారు. అయితే, ఆయన అప్పటికే పరారయ్యాడు. ఆ తర్వాత తనకు ఆరోగ్యం బాగాలేదంటూ మెయిల్ ద్వారా పై అధికారులకు సందేశం పంపాడు. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకోవడంతో పోలీసులు క్వార్టర్స్‌కు వెళ్తే సుబ్బారెడ్డి ఆసుపత్రిలో ఉన్నట్టు చెప్పారు. ఆ తర్వాతి రోజు వారు కూడా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. కాగా, నిందితుడు సుబ్బారెడ్డి హైకోర్టు ద్వారా ముందస్తు బెయిలు పొందినట్టు సమాచారం.
Go Back to Shorts
Subba Reddy
Anantapur Jailer
Cyber Crime
Visakhapatnam
Nude Calls
Harassment
Facebook
Police Case
Pre-Arrest Bail
Andhra Pradesh

More Telugu News