పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు
- షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు భద్రాచలం చేరుకోవాల్సిన పవన్
- సీతారాముల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలను సమర్పించాల్సిన డిప్యూటీ సీఎం
- పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీకి సమాచారం
అయితే పవన్ పర్యటన రద్దు అయినట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీకి సమాచారం అందింది. తన పర్యటన వల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ నెల 11న ఒంటిమిట్టలో కోదండరాములవారి కళ్యాణోత్సవం జరగనుంది. ఏపీ ప్రభుత్వం తరపున స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.