తెలంగాణలో మరో రెండు రోజులు వడగండ్ల వానలు.. వివిధ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్!
ఇక రాగల రెండు రోజుల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
శుక్రవారం నల్లగొండ, సూర్యాపేట, హన్మకొండ, భువనగిరి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, జనగాం, వికారాబాద్ తదితర జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.