అతడి బౌలింగ్ ఎదుర్కోవాలని ఉంది: నితీశ్ కుమార్ రెడ్డి
- నితీశ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
- బుమ్రాతో పోటీపడడం ఉత్సాహంగా ఉంటుందని వెల్లడి
- అతడి బౌలింగ్ లో పరుగులు చేయగలిగితే సంతోషిస్తానంటూ వ్యాఖ్యలు
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల వల్లే ఈ తరం భారత క్రికెట్ రూపుదిద్దుకుందని నితీశ్ కొనియాడాడు. వారంతా భారత క్రికెట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని, వారి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు.
బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో (గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీ) వెన్ను గాయానికి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
అంతేకాకుండా, ఎంఎస్ ధోని నుండి కెప్టెన్సీ నైపుణ్యాలను, కోహ్లీ నుంచి దూకుడును, రోహిత్ నుంచి పుల్ షాట్‌ను నేర్చుకోవాలనుకుంటున్నానని నితీశ్ తెలిపాడు. ఇక సన్ రైజర్స్ టీమ్ లో అభిషేక్ శర్మతో పోటీ పడాలని ఉందని, నెట్స్‌లో ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటామని నితీశ్ పేర్కొన్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవాళ ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.