కొడాలి నానికి ముంబయిలో హార్ట్ సర్జరీ పూర్తి
- ఇటీవల గ్యాస్ట్రిక్ సమస్యతో హైదరాబాదు ఏఐజీలో చేరిన కొడాలి నాని
- మూడు వాల్వ్స్ లో సమస్యలు ఉన్నట్టు వైద్యుల గుర్తింపు
- మెరుగైన చికిత్స కోసం ముంబయి తరలించిన కుటుంబ సభ్యులు
గత వారం రోజులుగా కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వాల్వ్స్ లో సమస్యలు ఉన్నాయని నిర్ధారించడంతో, స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబయికి తరలించారు.
ఈ క్రమంలోనే ఆయనకు ఈరోజు ముంబయి ఏషియన్ హార్ట్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స జరిగింది. ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా నేతృత్వంలోని వైద్య బృందం దాదాపు 10 గంటల పాటు శ్రమించి ఈ శస్త్రచికిత్సను పూర్తి చేసింది.