వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల కీలక నిర్ణయం
- వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై చర్చలో పాల్గొనాలని నిర్ణయం
- బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించిన నేతలు
- విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు
లోక్‌సభలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు. బిల్లుపై చర్చలో పాల్గొనాలని, అయితే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన, విభజన ఎజెండాను ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. పార్లమెంటులో విపక్షాలన్నీ కలిసి పనిచేస్తాయని ఆయన అన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.