400 ఎకరాల భూమిని కాపాడాలంటూ నిరసన.. హెచ్సీయూలో మరోసారి ఉద్రిక్తత
- కంచ గచ్చిబౌలిలోని భూమిని కాపాడాలంటూ విద్యార్థుల ధర్నా
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు
- భూముల అమ్మకాన్ని నిలిపివేయాలని డిమాండ్
విశ్వవిద్యాలయం లోపలకి వెళ్ళేందుకు బీజేవైఎం, ఏబీవీపీ, వామపక్షాల నాయకులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకొని ప్రధాన ద్వారాలు మూసివేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.