ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ సరికొత్త రికార్డు

GHMC Achieves Record Property Tax Collection
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆస్తి పన్ను వసూళ్లలో ఒక మైలురాయిని చేరుకుంది. నగర పరిధిలో పన్ను వసూళ్లు ఈ రోజు రూ. 2 వేల కోట్ల మార్కును అధిగమించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,012.36 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.

జీహెచ్ఎంసీ చరిత్రలో ఆస్తి పన్ను వసూళ్లు రూ. 2 వేల కోట్లు దాటడం ఇదే మొదటిసారి అని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం ద్వారా రూ. 465.07 కోట్లు వసూలయ్యాయని వెల్లడించింది.
Go Back to Shorts
GHMC
Hyderabad Property Tax
Property Tax Collection
GHMC Property Tax Record
2024-25 Financial Year
One Time Settlement
OTS Scheme
Municipal Corporation
Hyderabad
Tax Revenue

More Telugu News