Chiranjeevi: చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా తెరపైకి ఇద్దరి పేర్లు!

Chiranjeevis New Movie Heroine Speculation
  • చిరు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా
  • నిన్న సినీ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా జరిగిన పూజా కార్యక్రమం
  • ఈ చిత్రంలో హీరోయిన్ గా తెరపైకి ఆదితి రావు హైదరి, పరిణీతి చోప్రా పేర్లు
మెగాస్టార్ చిరంజీవి, క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో కొత్త చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా నిన్న ఈ సినిమాకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటేశ్, రాఘవేంద్రరావు, నాగబాబు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, బాబీ తదితరులు హాజరయ్యారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు అనిల్ రావిపూడి ప్రకటించారు. ఈ చిత్రానికి #Mega157, #ChiruAnil అనే వర్కింగ్ టైటిల్స్ పెట్టారు. 

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఆదితి రావు హైదరి పేరు తెరపైకి వచ్చింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాను అనిల్ రావిపూడి సంప్రదించినట్టు కూడా చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో కానీ... ఈ వార్త మాత్రం వైరల్ అవుతోంది. వీరిద్దరిలో ఎవరు మెగాస్టార్ పక్కన ఛాన్స్ కొట్టేస్తారనేది వేచి చూడాలి.

ఆదితి రావు హైదరి
పరిణీతి చోప్రా

More Telugu News

Chiranjeevi
Anil Ravipudi
Mega157
ChiruAnil
Aditi Rao Hydari
Parineeti Chopra
Telugu Cinema
Tollywood
Upcoming Telugu Movie
Sankranthi Release