పోలీసు కస్టడీకి వల్లభనేని వంశీ
- కృష్ణా జిల్లాలోని ఆత్కూరు భూకబ్జా కేసులో వంశీకి ఒకరోజు పోలీస్ కస్టడీ
- కంకిపాడు పీఎస్‌లో వైసీపీ నేతను ప్రశ్నిస్తున్న పోలీసులు
- గన్నవరం కోర్టు శుక్రవారం నాడు వంశీని ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతి
కాగా, గన్నవరం కోర్టు శుక్రవారం నాడు వంశీని ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆత్కూరు పీఎస్ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉంగుటూరు పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. ఇక గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.