Rahul Gandhi: లోక్‌స‌భ‌లో ప్రియాంక బుగ్గ‌లు నిమిరిన‌ రాహుల్ గాంధీపై స్పీక‌ర్‌ ఆగ్ర‌హం... ఇదిగో వీడియో!

Rahul Gandhis Action in Lok Sabha Sparks Outrage
షార్ట్స్‌లో చూడండి
లోక్‌స‌భ‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్ర‌వ‌ర్త‌న‌పై స్పీక‌ర్ ఓంబిర్లా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎంపీలంతా స‌భా మ‌ర్యాద‌ను పాటించాల్సిందేన‌ని అన్నారు. బుధ‌వారం నాడు స‌భ జరుగుతున్న స‌మ‌యంలో త‌న సోద‌రి ప్రియాంక గాంధీ వ‌ద్ద‌కు వ‌చ్చిన రాహుల్ గాంధీ ఆమె బుగ్గ‌లు నిమిరి ప‌ల‌క‌రించారు. 

ఈ విషయంపై స్పీక‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ స‌భ్యుల‌కు కీల‌క సూచ‌న చేశారు. "స‌భ‌లో ఎలా ప్ర‌వ‌ర్తించాలో కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయి. త‌ల్లీకూతుళ్లు, తండ్రీకూతుళ్లు, భార్యాభ‌ర్త‌లు, అన్నాచెల్లెళ్లు అయిన‌ప్ప‌టికీ త‌ప్ప‌కుండా అంద‌రూ సభా నియ‌మాలు పాటించాలి" అని ఓం బిర్లా పేర్కొన్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.   
Go Back to Shorts
Rahul Gandhi
Priyanka Gandhi
Lok Sabha
Speaker Om Birla
Parliamentary Conduct
Viral Video
Indian Politics
Political Controversy
Social Media

More Telugu News