వైసీపీ నాయకురాలు శ్యామల సహా 11 మంది యూట్యూబర్లపై క్రిమినల్ కేసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైసీపీ నాయకురాలు శ్యామల సహా 11 మంది యూట్యూబర్లపై క్రిమినల్ కేసులు

YCP leader Shyamala and 10 others booked
  • పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు
  • నిందితుల్లో పలువురు సెలబ్రిటీలు, టీవీ నటులు
  • త్వరలోనే నోటీసులు.. ఆపై అరెస్టులు
వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా 11 మంది యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. కలర్ ప్రిడక్షన్, నంబర్ ప్రిడక్షన్, క్రికెట్.. ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నందుకు గాను వీరిపై కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో హర్షసాయి, విష్ణుప్రియ, ఇమ్రాన్‌ఖాన్, రీతూ చౌదరి, బండారు శేషయాని సుప్రీత, కిరణ్‌గౌడ్, అజయ్, సన్నీయాదవ్, సుధీర్ సహా పలువురు సెలబ్రిటీలు, టీవీ నటులు ఉన్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. మియాపూర్‌కు చెందిన వి.వినయ్ అమీర్‌పేటలోని ఓ సంస్థలో శిక్షణ తరగతులకు హాజరవుతున్నాడు. తనతోపాటు శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులు బెట్టింగ్ యాప్‌లకు బానిసలై బోల్డంత డబ్బు నష్టపోయినట్టు గుర్తించాడు. దీంతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారంటూ పలువురు యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

అతడి ఫిర్యాదుపై నిన్న 11 మంది యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై గేమింగ్ చట్టంలోని సెక్షన్లు 3, 3ఏ, 4తోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66డీ, బీఎన్ఎస్ (భారత న్యాయ సంహిత)లోని సెక్షన్ 318(4) ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరందరికీ త్వరలోనే నోటీసులు జారీచేసి విచారించనున్నారు. అనంతరం వారి వాంగ్మూలాన్ని బట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
Advertisement
Betting Apps
Shyamala
Sunny Yadav
YouTubers
Panjagutta Police Station
Crime News

More Telugu News