చేతికర్రల సాయంతో నడుస్తున్న రాహుల్ ద్రవిడ్.. ఏంజరిగిందంటే..?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చేతికర్రల సాయంతో నడుస్తున్న రాహుల్ ద్రవిడ్.. ఏంజరిగిందంటే..?

Rahul Dravid injured while playing in Bengaluru
  • కొడుకుతో కలిసి క్రికెట్ ఆడుతుండగా గాయపడ్డ టీమిండియా మాజీ కోచ్
  • డాక్టర్లు కాలుకు పట్టీ వేయడంతో నడవలేని పరిస్థితి
  • ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ కు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్
మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయపడ్డారు. కొడుకుతో కలిసి క్రికెట్ ఆడుతుండగా గాయపడడంతో మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్నాడు. కాలికి గాయం కావడంతో డాక్టర్లు పట్టీ వేశారు. దీంతో ద్రవిడ్ చేతికర్రల ఊతంతో నెమ్మదిగా నడుస్తున్నాడు. కాగా, త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ సన్నద్ధతలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు మైదానంలో చెమటోడుస్తున్నారు.

టీమ్ మేనేజ్ మెంట్ జైపూర్‌ లో ఏర్పాటు చేసిన క్యాంప్ లో గంటల కొద్దీ శ్రమిస్తున్నారు. క్యాంప్ మొదలై చాలా రోజులు అవుతున్నప్పటికీ హెడ్ కోచ్ ద్రవిడ్ అక్కడ కనిపించలేదు. తాజాగా బుధవారం క్యాంప్ లో ప్రత్యక్షమైన ద్రవిడ్ ను చూసి ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ద్రవిడ్ కాలికి పెద్ద బ్యాండేజీ ఉండడం, చేతికర్రల సాయంతో అతికష్టమ్మీద నడుస్తుండడం చూసి టెన్షన్ పడుతున్నారు. కాలికి పట్టీతో ఓ కుర్చీలో కూర్చున్న ద్రవిడ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విజయ క్లబ్ తరఫున ఆడుతూ..
బెంగళూరు విజయ క్రికెట్ క్లబ్ తరఫున రాహుల్ గాంధీ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ గ్రూప్ 3 సెమీఫైనల్ మ్యాచ్‌లో ద్రవిడ్ తన కొడుకు అన్వయ్‌తో కలసి ఆడాడు. 28 బంతులు ఆడిన ద్రవిడ్ 29 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే వికెట్ల మధ్య పరుగులు తీస్తుండగా నొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి నొప్పి తీవ్రత పెరగడంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ట్రీట్‌మెంట్ తర్వాత తాజాగా రాజస్థాన్ క్యాంప్‌కు హాజరయ్యాడు. అతడు త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Advertisement
Rahul Dravid
Cricket
IPL
Bengaluru
Sports

More Telugu News