సినిమాల్లో నటించే మహిళలపై అసభ్య కామెంట్లు.. సినీ దర్శకుడు గీతాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు
- గతంలో కొన్ని సినిమాలు తీసిన గీతాకృష్ణ
- ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నంలలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ల నిర్వహణ
- మహిళలపై వెగటు వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని ‘వావా’ సభ్యుల డిమాండ్
గతంలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన గీతాకృష్ణ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ పరిశ్రమలో జరిగే వ్యవహారాలపై షాకింగ్ కామెంట్లు చేశారు. ధనవంతుల పిల్లలే డ్రగ్స్ వాడతారని, సాధారణ ప్రజలకు అదేంటో తెలియదని అన్నారు. ఇండస్ట్రీలో చాలామంది డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని పేర్కొన్నారు. అలాగే, సినిమాల్లో రొమాంటిక్ సీన్లను అమ్మాయిలు ఇష్టంతో చేయరని చెప్పారు. రూ. 50 లక్షలు ఇస్తే హీరోయిన్లు గెస్ట్‌హౌస్‌కు వెళతారని పేర్కొంటూ వెగటు వ్యాఖ్యలు చేశారు. ఇవే, కాదు సమయం చిక్కినప్పుడల్లా పరిశ్రమలోని మహిళలపై ఆయన నోరు పారేసుకుంటూ ఉంటారు.