చాంపియన్లకు అభినందనలు: రామ్‌చరణ్
- టైటిల్ పోరులో కివీస్‌ను మట్టికరిపించిన భారత జట్టు
- కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టు విజయానికి బాటలు వేసిన రోహిత్‌శర్మ
- టీమిండియాపై ప్రశంసల వెల్లువ
తాజాగా, టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్‌చరణ్ టీమిండియాకు అభినందనలు తెలిపాడు. ‘ఏమి ఆట! దేశానికి విజయాన్ని అందించినందుకు చాంపియన్లకు అభినందనలు’ అని ఎక్స్‌లో పేర్కొన్నాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు సాధించగా, అనంతరం 252 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. 76 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద అవార్డు’ దక్కింది.