ఐఫా ఉత్తమ నటి అవార్డు గెల్చుకున్న కృతి సనన్
- జైపూర్ లో అట్టహాసంగా ప్రారంభమైన ఐఫా అవార్డుల వేడుక
- పంచాయత్ సీజన్ 3 సిరీస్ కు అవార్డుల పంట
- సెక్టార్ 36 సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా విక్రాంత్ మస్సే
ఇతర అవార్డులు గెల్చుకున్నది వీరే..
అమర్ సింగ్ చంకీలా సినిమాకు దర్శకత్వం వహించిన ఇంతియాజ్ అలీని ఉత్తమ దర్శకుడు అవార్డు వరించింది. ఉత్తమ సహాయ నటుడిగా దీపక్ (సెక్టార్ 36), ఉత్తమ సహాయ నటిగా అనుప్రియా గోయెంకా (బెర్లిన్), ఉత్తమ కథ అవార్డు కనికా ధిల్లాన్ (దో పత్తి) గెల్చుకున్నారు. ఇక వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఉత్తమ వెబ్ సిరీస్ గా పంచాయత్ సీజన్ 3 నిలిచింది. ఇందులో నటించిన జితేంద్ర కుమార్, ఫైజల్ మాలిక్ లను ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటుడు అవార్డులు వరించాయి. ఈ సిరీస్ కు దర్శకత్వం వహించిన దీపక్ కుమార్ మిశ్రా ఈ ఏడాది ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఉత్తమ నటిగా శ్రేయాచౌదరి (బందీశ్ బందిట్స్ సీజన్ 2), ఉత్తమ సహాయ నటిగా సంజీదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్), ఉత్తమ కథ కోటా ఫ్యాక్టరీ సీజన్ 3, ఉత్తమ రియాల్టీ సిరీస్ గా ఫ్యాబ్యులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ గా యో యో హనీ సింగ్ ఫేమస్ నిలిచాయి.