టీమిండియా విన్నింగ్ మూమెంట్స్... ఇదిగో ఎమోషనల్ వీడియో!
ఇక చివర్లో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించిన సంగతి తెలిసిందే. దాంతో మ్యాచ్ గెలవగానే భారత జట్టు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాల్లో మునిగిపోయారు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చి సందడి చేశారు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ తాలూకు విన్నింగ్ మూమెంట్స్ కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎమోషనల్ వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.