ఏప్రిల్ 2 నుంచి ఇండియా, చైనాలపై ప్రతీకార సుంకాలు: ట్రంప్
- దశాబ్దాలుగా కొన్ని దేశాలు అమెరికాపై సుంకాలు విధిస్తున్నాయన్న ట్రంప్
- అమెరికాపై ఇండియా 100 శాతానికి పైగా టారిఫ్ లు విధించిందని వ్యాఖ్య
- అమెరికాకు ఎక్కడా న్యాయం జరగలేదన్న ట్రంప్
దశాబ్దాలుగా కొన్ని దేశాలు అమెరికాపై సుంకాలు విధిస్తున్నాయని... ఇప్పుడు తమ సమయం ఆసన్నమయిందని ట్రంప్ చెప్పారు. చైనా, బ్రెజిల్, ఇండియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు అమెరికా నుంచి అధిక సుంకాలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఇండియా తమపై 100 శాతానికి పైగా టారిఫ్ లు విధించిందని పేర్కొన్నారు. అమెరికాకు ఎక్కడా న్యాయం జరగలేదని తెలిపారు. అందుకే ఆయా దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు వసూలు చేస్తామని చెప్పారు. ఆయా దేశాలు ఎంత విధిస్తే తాము కూడా అంతే మొత్తంలో వసూలు చేస్తామని తెలిపారు. దీని వల్ల అమెరికా సంపన్నంగా మారుతుందని చెప్పారు.