వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'ఆఫీసర్..'
- మలయాళ సినిమా 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'
- ఈ నెల 20వ తేదీన విడుదలైన సినిమా
- ఆరు రోజుల్లో 25 కోట్ల కలెక్షన్స్
- వసూళ్లలో ఈ ఏడాది రెండో సినిమాగా నిలిచిన వైనం
ఈ సినిమాను కేవలం రూ.12 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. రోజురోజుకూ ఈ సినిమా వసూళ్లు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు జీతూ అస్రఫ్ తెరకెక్కించారు. ప్రియమణి ఇందులో కీలక పాత్ర పోషించారు. ఏడాది నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో కుంచాకో బోబన్ ఈ చిత్రంతో మళ్లీ ఫామ్ అందుకున్నట్లు కనిపిస్తోంది.
'పద్మిణీ' తర్వాత కుంచాకో బోబన్‌కు సరైన బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్నాడు. వచ్చే నెల వరకు ఈ సినిమాకు పోటీగా పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.