పెళ్లిలోనే పెళ్లి కొడుకుని లేపేసే గొడవ... 'ఆహా'లో 'మద్రాస్ కారన్'
- తమిళంలో రూపొందిన 'మద్రాస్ కారన్'
- షేన్ నిగమ్ సరసన మెరిసిన నిహారిక
- రేపటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
- గ్రామీణ నేపథ్యంలో సాగే రివెంజ్ స్టోరీ
అలాంటి ఈ సినిమా రేపటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన ప్రకటన చేస్తూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. రివెంజ్ డ్రామా నేపథ్యంలోనే నడిచే కథ ఇది. వాలి మోహన్ దాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి సెకండాఫ్ మైనస్ అయిందనే టాక్ వినిపించింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా'కి వస్తోంది.
కథ విషయానికి వస్తే, మీరా - సత్య ప్రేమించుకుంటారు. వాళ్ల పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతాయి. మగపెళ్లివారు తరలివస్తారు. ఆ ఊళ్లోని దురై సింగంతో పెళ్లి కొడుకు గొడవ పడతాడు. దాంతో ఊళ్లో వాళ్లంతా ఏకమైపోయి, పెళ్లి కొడుకుతో పాటు అతని కుటుంబ సభ్యులను చంపాలని నిర్ణయించుకుంటారు. ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది మిగతా కథ.