'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' .. వసూళ్ల వరద!
- మలయాళ సినిమాగా 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'
- ఈ నెల 20వ తేదీన విడుదలైన సినిమా
- తొలిరోజుతోనే వచ్చిన హిట్ టాక్
- అంతకంతకూ పెరుగుతున్న వసూళ్లు
ఈ సినిమాను కేవలం 12 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే 4 రోజులలోనే ఈ సినిమా, లాభాల బాట పట్టింది. ఏ రోజుకు ఆ రోజు ఈ సినిమా వసూళ్లు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నారు. వచ్చే నెల 2వ వారంలో స్ట్రీమింగుకు రానున్నట్టు తెలుస్తోంది.
హరిశంకర్ - గీత భార్యాభర్తలు. హరిశంకర్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. నీతి - నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ అతను. అలాంటి ఆయన నకిలీ బంగారానికి సంబంధించిన ఒక కేసును పరిష్కరించడం కోసం రంగంలోకి దిగుతాడు. అది తాను అనుకున్నంత చిన్నకేసు కాదని అర్థమవుతుంది. అప్పుడతను ఏం చేస్తాడు? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ.