AP Assembly Session: ఇవాళ ఏపీ అసెంబ్లీకి వర్కింగ్ డే కాదా...?

Is this day for AP Assembly working day or not
షార్ట్స్‌లో చూడండి
అసెంబ్లీకి వరుసగా 60 పనిదినాల పాటు హాజరుకాకపోతే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందున్న నేపథ్యంలో... నేడు వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సభకు హాజరైన కాసేపటికే, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడంలేదంటూ వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. 

అయితే, ఇవాళ అసెంబ్లీకి వర్కింగ్ డే కాదని అధికారులు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున గవర్నర్ ప్రసంగించడం లాంఛనంగా జరిగే కార్యక్రమని, ఇది వర్కింగ్ డేగా పరిగణించబోరని అధికారులు వివరించారు. అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన  జరిగే సమావేశాన్నే వర్కింగ్ డేగా లెక్కిస్తారని స్పష్టం చేశారు. 

ఇవాళ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై సంతకాలు చేసినప్పటికీ, ఆ సంతకాలను తాము పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు వివరించారు. సాంకేతికంగా చూస్తే అసెంబ్లీ సమావేశాలు  రేపు ప్రారంభం అవుతున్నట్టు లెక్క అని తెలిపారు.
Go Back to Shorts
AP Assembly Session
Working Day
Jagan
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News