ఈ వారంలోనే ఓటీటీలోకి డాకు మహరాజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఈ నెల 21 నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నెట్ ఫ్లిక్స్
- థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాలయ్య బాబు కొత్త మూవీ
- అఖండ 2 షూటింగ్ లో బిజీబిజీగా నందమూరి బాలకృష్ణ
ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్‌లు కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. మరోవైపు, బాలయ్య బాబు ప్రస్తుతం ‘అఖండ-2’ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. అఖండకు సీక్వెల్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.